మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Ayyappa Metla Paata (Okatava Mettu) – శ్రీ అయ్యప్ప మెట్ల పాట (ఒకటవ మెట్టు)


ఒకటవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప
స్వామి పొన్ అయ్యప్ప అయ్యనే పొన్ అయ్యప్ప
స్వామీ శరణం శరణం పొన్ అయ్యప్ప |
గణనాథసోదర శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
షణ్ముఖసోదర శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 1 ||

రెండవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
శివశక్తితనయ శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
హరిహరసుతనే శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 2 ||

మూడవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
మణికంఠాయ శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
సత్యరూపాయ శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 3 ||

నాల్గవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
త్రినేత్రరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
త్రిజగన్మోహన శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 4 ||

ఐదవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
ఓంకారరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
శాంతస్వరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 5 ||

ఆరవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
ఈశ్వరతనయ శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
శ్రీవిష్ణుపుత్ర శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 6 ||

ఏడవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
వ్యాఘ్రవాహన శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
వావరుస్వామియే శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 7 ||

ఎనిమిదవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
పాండ్యేశశాస్తా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
సద్గురునాథనే శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 8 ||

తొమ్మిదవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
విల్లాలివీరనే శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
వీరమణికంఠనే శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 9 ||

పదియవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
పంపాశిశువా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
ఆనందరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 10 ||

పదకొండవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కరుణామూర్తి శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కామితదాయక శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 11 ||

పన్నెండవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కర్పూరజ్యోతి శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కాంతిమలైవాసా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 12 ||

పదమూడవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
ఇరుముడిప్రియుడా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
మోహినీ సుతుడా శరణం పొన్ అయ్యప్ప | స్వామి | 13 ||

పదునాల్గవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కలియుగవరదా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కాపాడు దైవమా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 14 ||

పదినైదువ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
విశ్వనందన శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
చిన్మయరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 15 ||

పదహారవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
భూలోకనాథనే శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
విభూతినాథా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 16 ||

పదిహేడవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
అంబుజలోచన శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
ఏకాంతవాసా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 17 ||

పద్ధెనిమిదవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
జగములనేతా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
జ్యోతిస్వరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || 18 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.